close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/03/2020 22:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ను పీఎస్‌ఎల్‌తో పోల్చి బలయ్యాడు

ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజెన్లు

ఇంటర్నెట్‌డెస్క్‌:  పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)తో సమానంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)కు రేటింగ్‌ ఇవ్వడంతో ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ ట్విటర్‌లో ట్రోలింగ్‌కు గురయ్యాడు. హాగ్‌ తాజాగా నెటిజెన్లతో ప్రశ్న-జవాబుల సంభాషణ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ పాకిస్థాన్‌ అభిమాని ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌కు రేటింగ్‌ ఇవ్వాలని కోరాడు. దీంతో ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ చాలా తెలివిగా స్పందించి రెండు లీగ్‌లకు 9/10 రేటింగ్‌ ఇచ్చాడు. పాకిస్థాన్‌ స్వదేశంలో క్రికెట్‌ పునరుద్ధరణకు కృషిచేసిందని, అలాగే ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, అధిక సంఖ్యలో ఈ లీగ్‌ను వీక్షిస్తారని పేర్కొన్నాడు. దీంతో పలువురు భారత అభిమానులు బ్రాడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌తో ఐపీఎల్‌ను పోల్చడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కొవిడ్‌ 19) వైరస్‌ ఈ రెండు లీగ్‌ల మీదా పెను ప్రభావం చూపించింది. పీఎస్‌ఎల్‌ తుది ఘట్టానికి చేరుకోవడంతో ప్రేక్షకులు లేకుండానే మిగిలిన మ్యాచ్‌లను ఆడించాలని పీసీబీ భావిస్తోంది. ఈ రోజు రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతుండా, రేపు తుదిపోరు జరగనుంది. ఇక ఐపీఎల్‌ విషయానికొస్తే ఏప్రిల్‌ 15 వరకు బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేసింది. ఒకవేళ అప్పటికీ వైరస్‌ ప్రభావం తగ్గకపోతే టోర్నీని రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాగా, బ్రాడ్‌హాగ్‌ ఇదివరకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడిన సంగతి తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.