సీబీఐ విషయంలో అందుకే ఆ నిర్ణయం: రౌత్‌
close

తాజా వార్తలు

Published : 22/10/2020 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీబీఐ విషయంలో అందుకే ఆ నిర్ణయం: రౌత్‌

ముంబయి: మహారాష్ట్రలో స్థానిక పోలీసులు విచారిస్తున్న కేసుల్లో సీబీఐ జోక్యం చేసుకోవడం.. ఈ రాష్ట్ర హక్కులను అవమానించడమేనని శివసేన అభిప్రాయపడింది. అందుకే స్థానిక కేసుల విచారణలో సీబీఐకి గల సాధారణ సమ్మతి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో వెల్లడించారు. 

‘జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన విషయాల్లో విచారణ జరిపే అధికారం సీబీఐకి ఉంటుంది. కానీ రాష్ట్ర పోలీసులు విచారణ కొనసాగిస్తున్న కేసుల్లోనూ సీబీఐ జోక్యం చేసుకుంటోంది. రాజ్యాంగం ప్రకారం మహారాష్ట్ర పోలీసులకు వారికంటూ స్వతంత్ర హక్కులు ఉన్నాయి. అలాంటి హక్కుల్ని ఇతరులు వచ్చి అవమానించడం ఏంటి? అందుకే మా ప్రభుత్వం సీబీఐకి ఉండే సాధారణ అనుమతిని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది’ అని రౌత్‌ తెలిపారు. కాగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. ‘సీబీఐ నమ్మకమైన కేంద్ర దర్యాప్తు సంస్థ. టీఆర్పీ కేసును ముంబయి పోలీసులు విచారిస్తారు. రాజకీయ కారణాల వల్ల సీబీఐ ఇతర కేసుల్లో జోక్యం చేసుకోకూడదు’ అని పేర్కొన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన కేసుల విచారణలో సీబీఐకి ఉండే సాధారణ సమ్మతి అధికారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర కేసులపై ఎలాంటి ప్రభావం చూపదని వెల్లడించింది. ఇక భవిష్యత్తులో సీబీఐ రాష్ట్రంలో ఏవైనా కేసులను విచారించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. యూపీలో టీఆర్పీ రేటింగ్‌ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసు ఫైల్‌ చేసిన అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని