close

తాజా వార్తలు

సీబీఎస్‌ఈ పరీక్షలకు కాలిక్యులేటర్‌ అనుమతి

దిల్లీ: సెంట్రల్‌ బోర్డు ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్‌(సీబీఎస్‌సీ) పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు తమ వెంట కాలిక్యులేటర్లు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది నుంచి 10, 12వ తరగతి పరీక్షలు రాసే దివ్యాంగులు తమ వెంట బేసిక్‌ కాలిక్యులేటర్లు తెచ్చుకోవచ్చని తెలిపింది. సీఎస్‌డబ్ల్యూఎన్‌(చిల్డ్రన్‌ విత్‌ స్పెషల్‌ నీడ్స్‌) విభాగం కింద ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సీబీఎస్‌ఈ అన్ని పాఠశాలలకు లేఖలను పంపించింది. 

‘2020 పరీక్షల్లో సీఎస్‌డబ్ల్యూఎన్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు మాత్రమే కాలిక్యులేటర్లు తెచ్చుకునేందుకు అనుమతిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపల్స్‌కు జనవరి 28లోగా అభ్యర్థన పెట్టుకోవాలి. దాన్ని పాఠశాల యాజమాన్యం సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్‌ బోర్డుకు పంపించాలి’ అని సీబీఎస్‌ఈ తన లేఖలో పేర్కొంది. 2018 నుంచి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఉపయోగించుకునేందుకు సీబీఎస్‌ఈ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 20 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనుండగా, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30 వరకు 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.