close
Array ( ) 1

తాజా వార్తలు

బలహీన వర్గాలను అణగదొక్కే కుట్ర..:భట్టి

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భాజపా ద్వారా జరుగుతున్న ఈ కుట్ర ప్రమాదకరమైందన్నారు. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో భట్టి మాట్లాడారు. తాము కూడా భారతీయులమేనంటూ జాతీయ జెండా పట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి దేశంలో నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఆందోళన చెందేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. దేశంలోని మైనారిటీలు తమ బతుకేంటని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 

ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, నెహ్రూను కించపరుస్తూ గాంధీ సంకల్ప యాత్ర పేరుతో భాజపా డ్రామా ఆడుతోందని ఆరోపించారు. భాజపాకు తెరాస వత్తాసు పలుకుతోందని ఆయన విమర్శించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే చూస్తూ ఊరుకోమని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను బట్టబయలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
VITEEE 2020
dr madhu
besttaxfiler
Saket Pranamam
HITS2020

Panch Pataka

దేవతార్చన