
తాజా వార్తలు
కాంగ్రెస్ భావోద్వేగాలను రెచ్చగొట్టలేదు: భట్టి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆశించిన ఫలితాలు రాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సైద్ధాంతికంగా మాత్రం కాంగ్రెస్ విజయం సాధించినట్టే భావిస్తున్నామని చెప్పారు. గాంధీ భవన్లో భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. తాత్కాలిక లబ్ధి కోసం కాంగ్రెస్ ఎటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టలేదని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమిపై పార్టీ పరంగా సమీక్షించుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భట్టి వివరించారు.
Tags :