వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం మాది
close

తాజా వార్తలు

Updated : 09/11/2020 13:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం మాది

ఏపీ సీఎం జగన్‌

నెల్లూరు: జనవరికల్లా సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. మర్రిపాడు మం. కృష్ణాపురం వద్ద సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులకు సీఎం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామని, జిల్లాలో మరిన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం అన్నారు.

 ‘‘నీరు, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం మాది. 2022 ఖరీఫ్‌కు నీరిచ్చేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. నీటి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదు. 2020-21లో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. జలయజ్ఞం పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం.’’ అని జగన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని