అన్నిరంగాల్లో గొప్పవిజయాలు సాధించాం:కేసీఆర్‌
close

తాజా వార్తలు

Published : 27/04/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నిరంగాల్లో గొప్పవిజయాలు సాధించాం:కేసీఆర్‌

అత్యంత నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు 
నాయకులు, కార్యకర్తలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి
పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని తెరాస అధినేత సందేశం

హైదరాబాద్‌: తెరాస ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తికానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా రేపు ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ పతాకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న రాష్ట్రంలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను తెరాస సాధించిందన్నారు. సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. 

తెరాస సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందని.. ఇది తెరాస శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని సీఎం అన్నారు. తెరాస ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకలను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని.. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేద్దామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కచ్చితంగా లాక్‌డౌన్‌ నిబంధనలు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని ఆయన సూచించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని