close

తాజా వార్తలు

రాష్ట్రమంతా ‘హెల్త్‌ప్రొఫైల్‌’:కేసీఆర్‌

గజ్వేల్‌ నుంచే ప్రారంభిస్తాం

దేశంలో ఆర్థికమాంద్యం..రాష్ట్రాన్నీ అది పీడిస్తోంది

ఆదర్శ నియోజకవర్గంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాలి

గజ్వేల్‌: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సూచీ (హెల్త్‌ ప్రొఫైల్‌) తయారీకి అవసరమైన చర్యలు త్వరలోనే తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే దాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. పట్టణంలో మహతి ఆడిటోరియం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ సాహితీ సౌరభం ఈ ‘మహతి’ అని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గంలోనూ ఈ తరహా ఆడిటోరియం నిర్వహించే ఆలోచన ఉందన్నారు. గజ్వేల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జనవరి చివరి నాటికి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. అభివృద్ధి అనేది నిరంతరాయంగా కొనసాగాల్సిన ప్రక్రియ అని.. చేయాల్సింది చాలా ఉంటుందన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని.. మన రాష్ట్రానికీ అది పట్టి పీడిస్తోందని చెప్పారు.  త్వరలోనే నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో రోజంతా సమావేశమై గజ్వేల్‌ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో చర్చిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డినే గజ్వేల్‌ ఎమ్మెల్యేగా భావించిన ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపేలా మంత్రులు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం చమత్కరించారు.

‘ఎక్స్‌రే ఆఫ్‌ గజ్వేల్‌’ రూపొందించండి

‘‘నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికీ పని ఉండాలి. వారికి ఉపాధి కల్పించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తాం. గజ్వేల్‌లో ఇల్లులేని నిరుపేద కుటుంబం ఉండకూడదు. పైరవీలు, పార్టీలు లేకుండా అందరికీ న్యాయం చేస్తాం. ఇల్లులేని వారికీ డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తాం. రాష్ట్రంలో ప్రజలకు హెల్త్‌ కార్డు ఇవ్వాలనే ఆలోచన ఉంది. హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తాం. గజ్వేల్‌ నుంచే దాన్ని ప్రారంభించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌గారికి, అధికారులకు సూచిస్తున్నా. నియోజకవర్గంలో అటవీశాఖ అధికారులు మంచి ఫలితాలు రాబట్టారు. మల్లన్నసాగర్‌ అటవీ ప్రాంతం ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునేందుకు కార్యాచరణ ప్రారంభించాలి. ‘ఎక్స్‌రే ఆఫ్‌ గజ్వేల్‌’ పేరుతో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి దృష్టి సారించాలి. స్వయం సమృద్ధ గజ్వేల్‌ స్థాపనకు అందరూ సహకారం అందించాలి. కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిదంటూ ఉండదు. రెండేళ్లలో నియోజకవర్గంలోని గ్రామాల ముఖచిత్రం మారాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.


Tags :

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.