close

తాజా వార్తలు

Updated : 26/11/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

28న సీఎం కేసీఆర్‌ ప్రచార సభ 

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుందోంది. మరో మూడు రోజులే గడువుండటంతో అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నాయి. భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారానికి కేంద్రమంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికార మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.ఈ క్రమంలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఈ నెల 28న ఎల్బీస్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తెరాస నేతలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌, ఆ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన