close

తాజా వార్తలు

Published : 20/11/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెటర్నరీ పోస్టులను భర్తీ చేయండి:జగన్‌

అమరావతి: ఈ నెల 26న ఆసరా, వైఎస్‌ఆర్‌ చేయూత కింద పాడి పశువుల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 4 వేల గ్రామాల్లో ఈ పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాల్లో భాగంగా లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకలు పంపిణీ చేయనున్నారు. దశలవారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తొలుత ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పంపిణీ చేసి,  ఆ తర్వాత దశల వారీగా మిగిలిన జిల్లాల్లోనూ పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆవులు, గేదెలు కావాలని 4.68 లక్షల మంది, గొర్రెలు, మేకలు కావాలని మరో 2.49 లక్షల మంది మహిళలు కోరారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో యూనిట్‌ ధర రూ.75 వేలుగా నిర్ణయించారు. ప్రాజెక్టు విలువ రూ.5,386కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ప్రణాళికాబద్ధంగా పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మహిళల్లో స్వయం సాధికారత, సుస్థిర అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

మరోవైపు ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. చేయూత, ఆసరా పథకాల కింద మహిళలు ఏర్పాటు చేసుకున్న దుకాణాలపైనా జగన్‌ సమీక్షించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 78 వేల దుకాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. చేయూత కింద కొత్తగా లబ్ధి పొందిన 2.78లక్షల మంది నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని