close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గవర్నర్ అనుమతి తీసుకున్నారా?: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ తమిళిసై పిలిస్తే రానందుకు సీఎస్‌, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి శాంతకుమారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌కు చిత్తశుద్ధి ఉంటే తమ అధికారాలను ఉపయోగించాలని కోరారు. గవర్నర్‌కే ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే కేంద్రం కలగజేసుకోవాలని కోరారు. కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. భాజపా-తెరాస కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని రేవంత్‌ విమర్శించారు. 
హైదరాబాద్‌ ప్రజలను గాలికొదిలేసి కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కు వెళ్లారన్నారు. మూడు రోజుల్లో కేబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్‌ అని చెప్పేసరికి ప్రజలందరూ హైదరాబాద్‌ను ఖాళీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ సెక్షన్‌ 8ను ఉపయోగించి హైదరాబాద్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌పై పోరాడేందుకు దాతలు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారని, వాటిని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం పర్యవేక్షణలేని పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని తెలిపారు. గవర్నర్‌ తక్షణమే అధికారులకు నోటీసులు ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్, ప్రజా ప్రతినిధుల ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్ వెంటనే అఖిలపక్షాన్ని సమావేశపర్చాలని చెప్పారు. సచివాలయం కూల్చే ముందు గవర్నర్‌ అనుమతి ప్రభుత్వం తీసుకుందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రతి భవనం గవర్నర్‌ అధీనంలో ఉంటుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని