రైలు ప్రయాణమా! కొవిడ్‌ ముప్పెంతో తెలుసా?
close

తాజా వార్తలు

Published : 01/08/2020 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైలు ప్రయాణమా! కొవిడ్‌ ముప్పెంతో తెలుసా?

రెండు గంటలైతే 2.5 మీటర్ల దూరం ఉన్నా కష్టమే! 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: సుదూర ప్రయాణాలు చేసేందుకు పేద, మధ్య తరగతి వర్గాలు ఉపయోగించే ఏకైక రవాణా సాధనం రైలుబండి. ఆంక్షలు ఉండటంతో ప్రస్తుతం తక్కువగానే రైళ్లు నడుస్తున్నాయి. అయితే రైలులో ప్రయాణించినప్పుడు కొవిడ్‌-19 సంక్రమించే ముప్పు శాతం ఎంత? ఎన్ని గంటలు కూర్చుకుంటే ఎంతమేర ఉంటుంది? ఒక్కొక్కరి మధ్య ఎంత దూరం పాటిస్తే క్షేమం? ప్రయాణించే కాలం ఎంత పెరిగితే ముప్పు రేటు ఎంత పెరుగుతుంది? వంటి అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత కొరవడింది. అయితే చైనా వ్యాధి నియంత్రణ కేంద్రానికి చెందిన కొందరు పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసి క్లినికల్‌ ఇన్‌ఫెక్షియస్‌ జర్నల్‌లో ప్రచురించారు.

రైలు ప్రయాణికుల మధ్య సామీప్యతను బట్టి వైరస్‌ సంక్రమణ రేటు 0.32% ఉంటుందని పరిశోధకులు తెలిపారు. కొవిడ్‌-19 సోకిన వ్యక్తి ఆనుకొని కూర్చుంటే మాత్రం సగటున 3.5% రేటుతో వ్యాధి సోకుతుంది. ఒకే వరుసలో కొద్దిగా ఎడంతో కూర్చుంటే ఇది 1.5%గా ఉంటుందట. ఒక బోగీలోని మొత్తం ప్రయాణికులను బట్టి ప్రయాణ కాలం పెరిగే ప్రతి గంటకు సంక్రమణ రేటు 0.15% పెరుగుతుంది. ఏదేమైనప్పటికీ పక్కపక్కనే కూర్చుంటే మాత్రం ప్రతి గంటకు 1.3% ముప్పు పెరుగుతుందని తెలిసింది. అంతకు ముందు కరోనా బాధితుడు కూర్చున్న సీటులో కూర్చుంటే 0.075% రేటుతో వ్యాధి సంక్రమిస్తుంది.

లక్షణాలున్న కొవిడ్‌-19 బాధితులు ప్రయాణం చేసిన వివరాలను పరిశోధకులు పరిశీలించారు. 2019, డిసెంబర్‌ 19 నుంచి 2020, మార్చి 6 మధ్య 2,334 మంది రోగులు, 72,093 సన్నిహితులను గంట నుంచి ఎనిమిది గంటల ప్రయాణాన్ని బట్టి ప్రస్తుత గణాంకాలు విడుదల చేశారు. గంట ప్రయాణంలో ఒకే వరుసలో కూర్చున్న ఇద్దరి మధ్య మీటర్‌ కన్నా ఎక్కువ దూరం పాటిస్తే కరోనా సోకే ముప్పు తక్కువని వారు వివరించారు. అదే రెండు గంటల ప్రయాణమైతే 2.5 మీటర్ల దూరం ఉన్నా ప్రమాదకరమేనని వెల్లడించారు. ఎక్కువ సేపు రైలులో ప్రయాణించడం సురక్షితం కాదని పేర్కొంటున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని