close

తాజా వార్తలు

Published : 23/11/2020 19:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బైడెన్‌ పదవి చేపట్టే నాటికి 2కోట్ల కేసులు!

అమెరికాలో కరోనా తీవ్రతను అంచనా వేసిన నిపుణులు

వాషింగ్టన్‌: కరోనా దాటికి వణికిపోతున్న అమెరికాలో రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా జో బైడెన్‌ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే నాటికి కరోనా కేసుల సంఖ్య 2కోట్లకు చేరుకుంటుందని తాజా పరిశోధన అంచనా వేసింది. అమెరికాలో ఇప్పటికే కోటి 22లక్షల మందిలో కరోనా సోకగా, వచ్చే జనవరి 20వ తేదీ నాటికి ఈ సంఖ్య 2కోట్లకు చేరవచ్చని నిపుణులు అంచనా వేశారు. భౌతికదూరం, కరోనా టెస్టుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని గణాంక పద్ధతిలో కేసుల సంఖ్యను అంచనా వేశారు.

కరోనా కన్నా ముందుతో పోలిస్తే ప్రస్తుత భౌతిక దూరం నిబంధనలు 60శాతం పాటిస్తున్నట్లు పరిశోధనలో పేర్కొన్నారు. ఇదే తరహా భౌతిక దూరం నిబంధనలు కొనసాగితే, 2021 జనవరి చివరి నాటికి అమెరికాలో 2కోట్ల కేసులు నమోదయ్యే అవకశమున్నట్లు మాథమెటికల్‌ మోడల్‌ ద్వారా అంచనా వేశారు. అయితే, ఏప్రిల్‌ నెలలో పాటించినట్లు భౌతిక దూరం నిబంధనలు పాటిస్తే మాత్రం, కేవలం కొన్ని వారాల్లోనే అమెరికాలో కొవిడ్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇది కేవలం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరుగుదలను, రాబోయే రోజుల్లో వచ్చే సెలవులను పరిగణలోకి తీసుకొని మాత్రమే కేసుల సంఖ్యను అంచనా వేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. సంవత్సరం చివరి నెలలో హాలీడే సీజన్‌ ఉండడంతో విహారయాత్రల కారణంగా వైరస్‌ విజృంభణ కూడా మరింత ఎక్కువయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు అమెరికాలో కోటి 22లక్షల (1,22,49,528) పాజిటివ్‌ కేసులు బయటపడగా వీరిలో 2లక్షల 56వేల మంది మృత్యువాతపడ్డారు. నిత్యం అక్కడ లక్షా 50వేల నుంచి 2లక్షల కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని