close

తాజా వార్తలు

Published : 30/07/2020 02:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 5 రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఇలా..    

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో బుధవారం ఉద్ధృతంగా కేసులు వెలుగుచూశాయి. ఏపీలో రికార్డు స్థాయిలో 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 9,211 కేసులు, దిల్లీలో నిన్న ఆశ్చర్యకరంగా 613 కేసులే నమోదైనప్పటికీ తాజాగా 1035 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మంగళవారంతో పోలిస్తే ఒక్క కర్ణాటకలో మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగాయి. దేశంలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న టాప్‌-5 రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని పరిశీలిస్తే.. 

‘మహా’ విజృంభణ.. 4లక్షలు దాటాయ్‌..
మహారాష్ట్రలో కరోనా కోరలు చాస్తోంది. నిన్న కేవలం 7,717 కేసులు మాత్రమే నమోదైనప్పటికీ.. తాజాగా 9211 కొత్త కేసులు; 298 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 4,00,651కి చేరాయి. మొత్తం బాధితుల్లో 2,39,755మంది కోలుకోగా.. 14,463 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో 1,46,129 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 59.84శాతం కాగా.. మరణాల రేటు 3.61 శాతంగా ఉంది. ఇప్పటివరకు  రాష్ట్ర వ్యాప్తంగా 20,16,234 శాంపిల్స్‌ పరీక్షించినట్టు అధికారులు వెల్లడించారు.  ముంబయి మహానగరంలో ఈ రోజు 11,643 పరీక్షలు నిర్వహించగా.. 1,104 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నగరంలో డబ్లింగ్‌ రేటు 72రోజులుగా ఉంది. ధారావి మురికివాడలో ఈ రోజు కేవలం రెండు కొత్త కేసులు మాత్రమే వచ్చినట్టు బాంబే పురపాలక కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు.  

తమిళనాట 82 కొత్త మరణాలు
తమిళనాడులో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా 6,426 కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 60,794 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6246 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ వెల్లడించింది.  ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,34,114కి పెరిగింది. వీరిలో 1,72,883 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,741మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం పళనిస్వామి సమీక్షించారు. రాష్ట్రంలో మరణాల రేటు 1.6 శాతంగా ఉన్నట్టు తెలిపారు. చెన్నైలో 500లకు పైగా మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనివల్ల 1.45వేల మంది లబ్ధిపొందనున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేసే విధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు. 

హస్తినలో కొత్తగా 1035 కేసులు 
దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న కేవలం 613 కేసులే నమోదు కాగా.. బుధవారం 1035 కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి. తాజాగా 1126 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,18,633కి పెరిగింది. మరోవైపు, రాష్ట్రంలో మొత్తం బాధితులు 1,33,310కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,18,633 మంది కోలుకోగా.. 2,907మంది మృతి చెందారు. ప్రస్తుతం 10,770 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. మరోవైపు, దిల్లీలో 704 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దిల్లీలో ఇప్పటివరకు 9,94,219శాంపిల్స్‌ను పరీక్షించారు. 

ఏపీలో 24 గంటలు @ 10వేలకు పైనే..
ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 10,093 కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. వీరిలో 55,406మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,213 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 63,771 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. కర్నూలులో 179 మంది కరోనాతో మృతిచెందగా.. కృష్ణా జిల్లాలో 157మంది, గుంటూరులో 112, అనంతపురంలో 97, చిత్తూరులో 95మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 18,20,009శాంపిల్స్‌ను పరీక్షించారు.

కర్ణాటకలో మరో 92మంది మృతి
కర్ణాటకలో కొత్తగా 5,503 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 92మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మరో 2,397మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,504కు చేరింది. వీరిలో 42,901మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2,155 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 67,448 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.