close

తాజా వార్తలు

Published : 05/07/2020 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమరావతిపై రివర్స్‌ వైఖరి వద్దు!

సీఎం జగన్‌కు డి.రాజా సూచన

దిల్లీ: అమరావతి సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సీఎం జగన్‌ సంకుచిత వైఖరి వీడి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని హితవు పలికారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ పురోగమిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోకుండా జోక్యం చేసుకోవాలని రాజా డిమాండ్‌ చేశారు. అమరావతిపై ఏపీ ప్రజల్లో విస్తృత ఏకాభిప్రాయం ఉందన్న విషయాన్ని సీఎం జగన్‌ అర్థంచేసుకోవాలని కోరారు. ఇందుకు విశాల దృక్పథం అవసరమనీ..  సంకుచిత ధోరణి పనికిరాదన్నారు. సర్వసిద్ధంగా ఉన్న అమరావతిపై రివర్స్‌ వైఖరి వద్దని సూచించారు. ప్రజాభిప్రాయంతో జగన్‌ ఏకీభవించి.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ఎల్లకాలం దీన్నో వివాదాస్పద అంశంగా కొనసాగించొద్దన్నారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని