close

తాజా వార్తలు

Updated : 24/11/2020 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: రామకృష్ణ

గుంటూరు: పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. కేంద్రంపై పోరాటానికి ఉమ్మడిగా కలిసిరావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క పార్టీ, వ్యక్తుల అజెండా కాదని.. రాష్ట్ర ప్రజల ఉమ్మడి అజెండాగా అభివర్ణించారు. ప్రాజెక్టును చూసేందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా, సీపీఐ కవల పిల్లలని మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలను రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. 1925లో పుట్టిన సీపీఐ, తెదేపా ఎలా కవలపిల్లలో చెప్పాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అనిల్ కుమార్ అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. ఈ నెల 26న జరగనున్న సార్వత్రిక సమ్మెను కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర విజయవంతం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని