‘ఆ పోరాటాన్ని మతకోణంలో చూడొద్దు’
close

తాజా వార్తలు

Published : 18/09/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆ పోరాటాన్ని మతకోణంలో చూడొద్దు’

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌

హైదరాబాద్‌: సామాజిక విభజనకు భాజపా, ఆరెస్సెస్ కుట్రలు పన్నుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌‌ ఆరోపించారు. సాయుధ పోరాట స్ఫూర్తితో ఆ కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ముగింపు సభ జరిగింది. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బృందాకారాట్‌ హాజరయ్యారు. సాయుధ పోరాటాన్ని మత కోణంలో చూడొద్దని హితవు పలికారు. సమాజంలో మహిళల పాత్రను సమున్నతంగా నిలబెట్టిన పోరాటం అది అని చెప్పారు. ఇప్పటికీ భూ సమస్యలు అలాగే ఉన్నాయని.. భూమిపై ఆనాడు పెత్తందారులు, నేడు పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగుతుందని దుయ్యబట్టారు. 

తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తన పరిపాలనలోని వైఫల్యాలను సరిదిద్దుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. భూ గరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం.. ఏ వ్యక్తికీ 54 ఎకరాలకు మించి ఉండకూదని గుర్తు చేశారు. కానీ అంతకుమించి వందల, వేల ఎకరాలున్న భూస్వాములు నేడు లేరా?అని ప్రశ్నించారు. అలాంటి వారందరికీ రైతు బంధు కింద డబ్బులు రావటం లేదా? అని వీరభద్రం నిలదీశారు. తెరాస అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఒక్క రోజులో రాష్ట్రం మొత్తం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారని గుర్తు చేశారు. అలాంటిది సమగ్ర భూ సర్వేపై ఎందుకు దృష్టి సారించటం లేదని ప్రశ్నించారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ పేరిట పేద, మధ్య తరగతి ప్రజలపై భారం వేయబోతున్నారని ఆయన మండిపడ్డారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని