ఐఈడీ పేలుడు.. అసిస్టెంట్‌ కమాండెంట్‌ మృతి
close

తాజా వార్తలు

Updated : 30/11/2020 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐఈడీ పేలుడు.. అసిస్టెంట్‌ కమాండెంట్‌ మృతి

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఐఈడీ బాంబు పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 206వ బెటాలియన్ కోబ్రా దళానికి చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌ బలేరావ్‌ (40) చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కమాండెంట్‌ మృతి చెందినట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. శనివారం సుక్మా జిల్లాలోని బుర్కపాల్‌, చింతకుప్ప అటవీ ప్రాంతాల మధ్య ఉన్న తాడుమెట్ల గ్రామం వద్ద మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో 206వ బెటాలియన్ కోబ్రా దళానికి చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌ బలేరావ్‌ సహా 9 మంది కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ అసిస్టెంట్ కమాండెంట్‌ నితిన్‌ బలేరావ్‌ మృతి చెందారు. గాయపడిన మిగతా 8 మంది కమాండోల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. అధికారిక లాంఛనాలతో అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌ బలేరావ్‌ మృతదేహాన్ని అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు తమ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సుక్మా జిల్లాలోని పుష్పల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం దినేశ్ వర్మ (35) అనే జవాన్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ 4వ బెటాలియన్‌లో విధులు నిర్వహస్తున్నారు. సెలవుపై ఇంటికి వెళ్లి తిరిగి ఈ నెల 26న విధుల్లో చేరిన దినేశ్‌ వర్మ మానసిక ఆందోళన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వినోద్‌ పోర్సే (29) అనే జవాన్‌ ఆదివారం ఉదయం వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని