close

తాజా వార్తలు

రాష్ట్రపతి పర్యటనపై తెలంగాణ సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం ఈనెల 20న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విడిదికోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆయన ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించి సమన్వయంతో విధులు నిర్వహించాలని సీఎస్‌ సూచించారు. హకీంపేట విమానాశ్రయంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్‌, నిరంతర విద్యుత్‌ సరఫరా, రహదార్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో సీసీటీవీలు, వైద్య బృందం, టెలిఫోన్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యం, పత్రికలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రథమ పౌరుడి పర్యటన సమయంలో విధుల్లో ఉండే సిబ్బంది, కంట్రోల్‌ రూమ్‌లో ఉండే ఇన్‌ఛార్జి అధికారుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని ఎస్కే జోషి ఆదేశించారు. 

ఈనెల 20 నుంచి 28వరకు రాష్ట్రపతి పర్యటన సాగనుంది. 20న ఆయన ఉదయం 10.30 గంటలకు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి పాలెం విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి 10.55 గంటలకు వాయుసేన విమానంలో హైదరాబాద్‌ బయల్దేరతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళతారు. 21, 22 తేదీల్లో ఇక్కడే బస చేసి 23 నుంచి 26 వరకు తిరువనంతపురం పర్యటనకు వెళ్లనున్నారు. తిరిగి 26 సాయంత్రం ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. 28న మధ్యాహ్నం హకీంపేట నుంచి వాయుసేన విమానంలో దిల్లీ బయల్దేరి వెళతారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.