కాల్వలోకి దూసుకెళ్లిన కారు: నలుగురి మృతి
close

తాజా వార్తలు

Updated : 16/10/2020 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాల్వలోకి దూసుకెళ్లిన కారు: నలుగురి మృతి

రొంపిచర్ల: గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. నార్కట్‌పల్లి-మేదరమెట్ల రహదారిలో రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం మధ్య ఈ ప్రమాదం జరిగింది. కారు తంగేడుమల్లి మేజర్‌ కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నివాసముంటున్న మాధవ్‌ అనే వ్యక్తి గృహాలకు రంగులు వేస్తుంటాడు. ప్రకాశం జిల్లా పామూరిలోని సొంతింటికి రంగులు వేయించేందుకు తన దగ్గర పనిచేస్తున్న బీరూగౌడ్‌, బాలాజీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుని గురువారం రాత్రి జగిత్యాల నుంచి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్‌ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బీరూ గౌడ్‌, బాలాజీతో పాటు మరో ఇద్దరు మృతిచెందగా.. తీవ్రగాయాలతో బయటపడిన మాధవ్..‌ అటుగా వెళ్తున్న పోలీసులకు ప్రమాదం గురించి వివరించాడు. దీంతో పోలీసులు కారుతోపాటు మృతదేహాలను వెలికితీసి నర్సారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని