కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు
close

తాజా వార్తలు

Published : 10/02/2020 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు

బెంగళూరు: బెంగళూరులో ఓ ప్రమాదం కానిస్టేబుల్‌ మృతిచెందాడు. అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపు తప్పి సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు కానిస్టేబుల్‌ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్‌  ఉన్నతాధికారితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో బసవన్నగూడి నుంచి అతివేగంగా వచ్చిన కారు ఉమామహేశ్వర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ ఉమామహేశ్వర్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని