
తాజా వార్తలు
జాన్వి.. లుక్స్‌తో చంపేస్తావా..?
దివ్వెల వెలుగుల్లో మెరిసిన తారలు
ఇంటర్నెట్‌డెస్క్: పండుగలు.. స్పెషల్ డేస్ వచ్చాయంటే నెటిజన్లు ఎంతో సంతోషిస్తుంటారు. ఎందుకంటే సెలబ్రేషన్స్‌లో భాగంగా తమ అభిమాన నటీనటులు సరికొత్త ఫొటోలు షేర్ చేస్తుంటారని. తాజాగా దీవాళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీతారలు షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు మనసు పారేసుకున్నారు. పండగ సందర్భంగా తారలందరూ డిజైనరీ దుస్తుల్లో మెరిసిపోయారు. దివ్వెల వెలుగుల్లో సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన తమ అభిమాన నటీమణులను చూసి ప్రేక్షకులు అంతులేని ఆనందాన్ని పొందారు. తమ సంతోషాన్ని తెలియజేస్తూ సదరు నటీమణులకు ‘క్యూట్, లవ్లీ, అందంగా ఉన్నారు’ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్ర.. సిద్ధం చేసిన దుస్తుల్లో నటి జాన్వికపూర్ మెరిసిపోయారు. పసుపు వర్ణపు చీరలో ఆమెను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. జాన్వి ఆనందానికి.. పరవశించిపోయిన ఓ నెటిజన్.. ‘జాన్వి.. మీ లుక్స్ చంపేయాలని ప్లాన్ చేస్తున్నారా?’ అని కామెంట్ చేశారు. జాన్వి మాత్రమే కాకుండా ఎంతో మంది తారలు దీవాళి లుక్స్‌తో అభిమానుల మనుసు దోచుకున్నారు. అలా.. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న కొంతమంది హీరోయిన్స్ పిక్స్ మీకోసం..