close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 29/04/2020 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఇర్ఫాన్‌ ఖాన్‌ చివరి వరకూ పోరాడాడు’

నటుడి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం పట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, పరిణీతి చోప్రా, తమన్నా, భూమి పెడ్నేకర్‌ తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు చేశారు. 2018 నుంచి ఇర్ఫాన్‌ ఖాన్‌ అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. యూకేలో చికిత్స తీసుకుని ఇటీవల భారత్‌కు వచ్చారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

* ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణవార్త విని చాలా బాధపడ్డా. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అద్భుతమైన నటుడు. అతడి స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. మన హృదయాల్లో ఆయన గుర్తులు ఎప్పటికీ అలానే ఉంటాయి. డియర్‌ ఇర్ఫాన్‌.. మేం నిన్ను మిస్‌ అవుతున్నాం- చిరంజీవి

* నా స్నేహితుడు.. నా స్ఫూర్తి.. మా కాలంలోని ఓ గొప్ప నటుడు. నీ ఆత్మ శాంతించాలి ఇర్ఫాన్‌ భాయ్‌. మేం నిన్ను మిస్‌ అవుతున్నాం.. నీ జ్ఞాపకాలతో జీవించబోతున్నాం- షారుక్‌ ఖాన్‌

* సినీ ప్రపంచం ఓ ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఇర్ఫాన్‌ ఓ అద్భుతమైన నటుడు. ఈ లెజెండ్‌ను చిత్ర పరిశ్రమ మిస్‌ అవుతోంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా ఇర్ఫాన్‌ జీ- రామ్‌ చరణ్‌

* ఇర్ఫాన్‌ లాంటి గొప్ప నటుడ్ని కోల్పోయాం. కేవలం భారత చిత్ర పరిశ్రమే కాదు ప్రపంచ చిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. నేను వ్యక్తిగతంగా ఓ మంచి స్నేహితుడ్ని కోల్పోయా. ఇటువంటి కష్టసమయంలో దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు శక్తిని ఇవ్వాలి- గుణశేఖర్‌

* ‘ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణ వార్త విని షాక్‌కి గురయ్యా. మా కాలపు అసాధారణమైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవ ఎప్పటికీ మన మనసుల్లో అలానే నిలిచి ఉంటుంది’ - దిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్‌ కేజ్రీవాల్‌

* ‘ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణ వార్త నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. అతను ఎంతో నైపుణ్యం ఉన్న నటుడు. ఉత్తమ సహనటుడు. చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారు.  తనకంటూ ఓ ప్రత్యేకతను‌ ఏర్పరచుకుని.. చిన్న వయసులోనే మనల్ని వదిలి వెళ్లిపోయాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి’ -అమితాబ్‌ బచ్చన్‌

* ‘ఓ గొప్ప నటుడిని మనం కోల్పోయాం. అయన చివరి వరకూ పోరాడుతూనే ఉన్నాడు. నిన్ను మేం చాలా మిస్‌ అవుతున్నాం. ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా’ -బోనీ కపూర్‌

* ‘ముఖాముఖిగా కలవకపోయినా కొందరితో బంధం ఏర్పడుతుంది. మన రోజువారి జీవితంలో వారు ఉన్నట్లు ఉంటుంది. మనతో ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది. ఇర్ఫాన్‌ ఖాన్‌ అలాంటి వ్యక్తి. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం’ - ఖుష్బూ

* ‘నా ప్రియమైన స్నేహితుడు ఇర్ఫాన్‌. నువ్వు నీ జీవితంతో ఎంతో ధైర్యంగా పోరాడావు. నీ పట్ల నేనెప్పుడూ గర్వంగానే ఉన్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఇర్ఫాన్‌ ఖాన్‌కు నా సెల్యూట్‌’ - దర్శకుడు సూజిత్‌ సర్కార్‌

* ‘2020 మనందరిలో విషాదం నింపకూడదని అనుకున్నాం. కానీ అదే జరిగింది. ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంకా షాక్‌లో ఉన్నా. ఆయన మనల్ని తొందరగా వీడి వెళ్లిపోయారు. ఇర్ఫాన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ -తమన్నా

* ‘ఇర్ఫాన్‌ గొప్ప వ్యక్తి, ఆయన మరణం నన్ను ఎంతో బాధిస్తోంది. ఆయనతో ప్రతి సంభాషణ ఓ మధుర జ్ఞాపకం. లవ్‌ యూ ఇర్ఫాన్‌ ఖాన్‌. నువ్వు నిజమైన  పోరాటయోధుడివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ - పరిణీతి చోప్రా

* ‘ఇర్ఫాన్‌ ఖాన్‌ సర్‌ మృతితో నా గుండె పగిలిపోయింది. మేమంతా శోకంలో ఉన్నాం. మా హృదయాల్లో మీరు ఎప్పటికీ నిలిచి ఉంటారు. మీ అద్భుతమైన నటనతో మాకు వినోదం పంచినందుకు ధన్యవాదాలు. మీరు ఓ ఇన్‌స్టిట్యూషన్‌.. మాకంతా స్ఫూర్తి’ - భూమి పెడ్నేకర్‌

* ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓ గొప్ప నటుడు ఈ లోకాన్ని చాలా తొందరగా వీడి వెళ్లిపోయాడు. ఆయన్ను చాలా మిస్‌ అవుతున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా - మహేశ్‌బాబు
* సినిమా ప్రపంచం గొప్ప నటుడ్ని కోల్పోయింది. అతడితో కలిసి పనిచేసే అదృష్టం నాకు లేకుండా పోయింది. కానీ ఆయన నటనను మాత్రం చూశా. అతడు ఓ అద్భుతమైన నటుడు. మీరు పరిశ్రమకు చేసిన సేవ మాకెప్పటికీ గుర్తుండిపోతుంది - వెంకటేష్‌
* దిగ్భ్రాంతికర వార్త. ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి నన్ను తీవ్రంగా బాధిస్తోంది. మా కాలంలోని ఓ గొప్ప నటుడు. ఈ కష్ట సమయంలో అతడి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు తట్టుకునే శక్తినివ్వాలని కోరుకుంటున్నా - అక్షయ్‌ కుమార్‌
* నీ మరణం నన్ను కలచివేసింది. చాలా తొందరగా మమ్మల్ని విడిచి వెళ్లిపోయావు ఇర్ఫాన్‌. చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు ధన్యవాదాలు. నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం - ప్రకాశ్‌రాజ్‌
* ఇర్ఫాన్‌ సర్‌ ఆత్మకు శాంతి చేకూరాలి. నేను బాధలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలు నాలో ఎంత స్ఫూర్తి నింపాయో మీకు తెలియదు - సోనమ్‌ కపూర్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.