close
Array ( ) 1

తాజా వార్తలు

‘వలస కూలీల కోసం మరిన్ని రైళ్లు నడపండి’

రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దిల్లీ: వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు మరిన్ని శ్రామిక్‌ రైళ్లను నడపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. ఈ క్రమంలో రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా మహిళలు, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని హితవు పలికింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి భయంతో పాటు ఉపాధి కోల్పోతామనే ఆందోళనతోనే కూలీలు స్వస్థలాలకు పయనమవుతున్నారని అజయ్‌ భల్లా లేఖలో పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మరిన్ని రైళ్లు నడపడం, విశ్రాంతి సముదాయాలు ఏర్పాటు చేయడం, శానిటైజేషన్‌, ఆరోగ్యం, ఆహారం వంటి వసతుల్ని కల్పించాలని కోరారు.

రైళ్లు, బస్సులు ఎప్పుడు బయలుదేరుతాయన్న విషయంలో సందిగ్ధత ఉండొద్దని.. ఇది కూలీల అసహనానికి దారితీసే అవకాశం ఉందని అజయ్‌ భల్లా పేర్కొన్నారు. పిల్లలు, మహిళలకు అసవరమైన ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు. కాలినడకన బయలుదేరిన కూలీలను సంబంధిత రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్లు, విశ్రాంతి సముదాయాలకు తరలించే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకోవాలని సూచించారు. వలస కూలీల బస్సులను రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆపొద్దని కోరారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.