యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి
close

తాజా వార్తలు

Published : 02/10/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని బహుజన్‌ సమాజ్‌వాద్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఈ నేపథ్యంలో యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని గురువారం ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవటంతో మాఫియా, నేరగాళ్లు, అత్యాచారాలు చేసే దుర్మార్గులు యూపీలో విచ్చలవిడిగా తిరుగుతున్నారని మాయావతి మండిపడ్డారు. యోగి ఆథిత్యనాథ్‌ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించలేరన్నారు. ఆయన స్థానంలో మరో సమర్థుడైన నాయకుడిని ఉంచాలని ప్రధానికి సూచించారు.

హాథ్రాస్‌లో యువతిపై జరిగిన అత్యాచారం మరువక ముందే ఆ రాష్ట్రంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. బలరామ్‌పూర్‌కు చెందిన యువతి కాలేజ్‌లో చేరేందుకు అడ్మిషన్‌ కోసం వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరు యువకులు ఆ యువతిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో ఇంటికి చేరిన యువతి ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నేరాలతో పాటు బుధవారం అయోధ్యలో ఓ పదో తరగతి బాలికపై అత్యాచారం జరిగింది. భాజపా పాలిత రాష్ట్రంలో మహిళలపై వరుస ఘటనలు జరుగుతుండటంతో కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

ఆ రాష్ట్ర మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భాజపా పాలన నిజస్వరూపం ఈ ఘటనలతోనే అర్థమవుతుందని ఆయన ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని