close

తాజా వార్తలు

Published : 26/11/2020 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతులను శత్రువుల్లా చూస్తున్నారు: హర్‌సిమ్రత్‌

దిల్లీ: ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీకి కదం తొక్కిన రైతులను కేంద్ర ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌బాదల్‌ మండిపడ్డారు. దిల్లీ వైపు ర్యాలీగా వెళ్తున్న రైతులను అడ్డుకోవడాన్ని ఖండించారు. రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా ఆలోచించడానికి బదులు అణచివేతకు ప్రయత్నించడం సరికాదన్నారు. రైతులపై పోలీసులను ప్రయోగించడం ద్వారా రాజ్యాంగ దినోత్సవాన్ని అన్నదాతలకు చీకటి రోజుగా కేంద్రం మార్చిందన్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న శంభు ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె స్పందించారు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ముందుకెళ్తున్న రైతులపై హరియాణా పోలీసులు జల ఫిరంగులతో పాటు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి చెదరగొట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై స్పందించిన హర్‌సిమ్రత్‌ కౌర్ ‌బాదల్‌ రైతుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు తనను షాక్‌కు గురిచేయడంతో పాటు బాధకలిగించిందన్నారు. సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి పదవికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన