close

తాజా వార్తలు

Updated : 13/11/2020 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో ఎవరికైనా భద్రత ఉందా?: చంద్రబాబు

అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూశాక రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉందా? అనే అనుమానం కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అబ్దుల్‌ సలాం కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు కావడంపై ఆయన స్పందించారు. సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం చాలా బాధాకరమని.. వేధింపులకు గురిచేసి కుటుంబం మొత్తాన్ని బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేస్తే స్థానిక పోలీసులు ఏం తెలియనట్లు నటించారన్నారు. సలాం కుటుంబసభ్యులు వీడియో విడుదల చేసేవరకు వాస్తవాలు బయటకు రాలేదని చెప్పారు. వీడియో విడుదలయ్యాక కూడా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని.. దీనిపై ట్వీట్‌ పెట్టిన తర్వాతే స్పందించారని చంద్రబాబు వెల్లడించారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు కుటుంబాలు బలైపోతున్నాయనేందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. 

‘‘కేసు పెట్టినట్టు ఉండాలి.. బెయిల్‌ రావాలనే రీతిలో పోలీసులు వ్యవహరించారు. తెదేపా న్యాయవాది ద్వారానే బెయిల్‌ వచ్చిందంటూ కొత్త నాటకానికి తెరలేపారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రాజధాని రైతులపై ఎలాంటి కేసులు పెట్టారు? పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఎవరిని మోసం చేస్తున్నారు?ఇంత అమానుషం జరిగిన తర్వాత కూడా బుకాయిస్తున్నారు. కేసు సక్రమంగా నమోదు చేస్తే విచారణకు ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను పంపాల్సిన అవసరమేంటి? కోర్టులు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే సలాం కుటుంబానికి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. తెదేపా హయాంలో శాంతి భద్రతల సమస్యలు ఏనాడూ తలెత్తలేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజం, మత విద్వేషాలు ఎక్కడైనా ఉంటే అన్నింటినీ లేకుండా చేశాం. అలాంటి రాష్ట్రంలో ఏడాదిన్నరగా ఆటవిక పాలక సాగుతోంది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ప్రజలు గమనించాలి. అబ్దుల్‌ సలాం కుటుంబానికి మద్దతుగా నిలవాలి. ఇవాళ అబ్దుల్‌ సలాం కుటుంబానికి జరిగిన అదే అన్యాయం భవిష్యత్తులో మన కుటుంబాలకు జరుగుతుందేమో?ఇలాంటి విషయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని చంద్రబాబు తెలిపారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన