close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120027880 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => ZTLc5gbKy_k [video_short_link] => ZTLc5gbKy_k [created_by] => [created_date] => [modified_by] => 9030386 [modified_date] => 2020-02-27 18:22:19.993185 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

విశాఖలో చంద్రబాబు ముందస్తు అరెస్ట్‌

విశాఖ: తెదేపా అధినేత చంద్రబాబును విశాఖ పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించారు. అక్కడ వీఐపీ లాంజ్‌లో ఆయన్ను ఉంచారు. వీఐపీ లాంజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచే అవకాశముంది. ఆ తర్వాత చంద్రబాబును విమానాశ్రయం నుంచి విజయవాడ లేదా హైదరాబాద్‌ పంపిస్తారా? విశాఖలోనే ఇతర ప్రాంతానికి తరలిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 

ఉదయం నుంచి విశాఖ విమానాశ్రయం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైకాపా శ్రేణులు విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయం బయట తన కాన్వాయ్‌లోనే సుమారు మూడు గంటలసేపు ఉండిపోయారు. అనంతరం వాహనం నుంచి దిగి పోలీసుల వైఖరిని నిరసిస్తూ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం కొద్దిసేపటికే పోలీసులు ఆయన్ను ముందస్తు అరెస్ట్‌ చేశారు.

ఇవీ చదవండి..

నన్ను ఏ చట్టం కింద అరెస్ట్‌ చేస్తారు?:చంద్రబాబు

విమానాశ్రయం బయట బైఠాయించిన చంద్రబాబు

వైకాపా వీరంగం.. విశాఖలో టెన్షన్‌.. టెన్షన్‌!

‘రూ.500 ఇస్తాం.. గుడ్లు, టమాటాలు విసరాలి’

కాలి నడకకు సిద్ధపడిన చంద్రబాబు..కానీ..

 

 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.