
తాజా వార్తలు
‘బాలు మృతితో అద్భుతశకం ముగిసింది’
తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం
అమరావతి: ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలు మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసిందన్నారు. తన గానంతో ప్రజల గుండెల్లో బాలు అజరామరుడిగా ఉంటారని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి భారత చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కళాకారులు, యావత్ సంగీత ప్రపంచానికే తీరనిలోటన్నారు.
ఎస్పీ బాలు 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి, గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కి తెలుగు జాతి ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తి చేశారని చంద్రబాబు కొనియాడారు. ఆయన కోలుకుని ఆరోగ్యంతో తిరిగి వచ్చి మళ్లీ తన పాటలతో పరవశింపజేస్తారని అందరూ గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన మృతి వార్త ఆశనిపాతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా శ్రోతలు, ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. పద్మశ్రీ, పద్మభూషణ్ తోపాటు ఆయన సాధించిన అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులే బాలసుబ్రహ్మణ్యం ప్రతిభకు కొలమానాలని పేర్కొన్నారు. తెదేపా ఆవిర్భావం, జన్మభూమి పథకం సందర్భంగా బాలు పాడిన పాటలతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం, ఉత్సాహం పరవళ్లు తొక్కేదని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- మరో 6 పరుగులు చేసుంటే..
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
