కరోనా ఫలితాల్లో తీవ్ర జాప్యం: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 30/07/2020 22:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఫలితాల్లో తీవ్ర జాప్యం: చంద్రబాబు


అమరావతి: కరోనా పరీక్షల ఫలితాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఫోన్‌ చేసినా గంటలపాటు అంబులెన్సు రావడం లేదని అన్నారు. పడకలు లేక చెట్ల కింద రోగులు, మార్చురీలో మృతదేహాలు అలాగే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారడం  బాధాకరమని వ్యాఖ్యానించారు. కరోనా పరీక్షలకు సంబంధించిన కేంద్ర జాబితాలో ఏపీ ఎందుకు లేదని? ప్రశ్నించారు. ‘‘ 10 లక్షల్లో 140 మందికి పైగా పరీక్షలు చేస్తున్న జాబితాలో ఏపీ ఎందుకు లేదు. ఏపీ ప్రజల్ని నకిలీ సంఖ్యలతో ఎందుకు మోసం చేస్తున్నారు?’’అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కరోనాతో మృతి చెందిన తిరుపతి వాసి శేఖర్‌ 3 రోజులు ఆస్పత్రి చుట్టూ తిరిగారని, సరైన సమయంలో ఆయనకు చికిత్స అందించలేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని అన్నారు.ఈ మేరకు శేఖర్‌ కుటుంబసభ్యుల వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని