
తాజా వార్తలు
‘నెల్లూరులో సంగీత వర్సిటీ ఏర్పాటు చేయండి’
ఎస్పీ బాలు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలి
ఏపీ సీఎం జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
అమరావతి: అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఏటా ఎస్పీబీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని.. సంగీత వర్సిటీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ ప్రాంతాన్ని బాలు కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ఎస్పీ బాలు పేరిట జాతీయ పురస్కారాన్ని అందించాలని.. ప్రభుత్వ సంగీత అకాడమీకి ఆయన పేరు పెట్టాలని చంద్రబాబు సూచించారు. లలిత కళలకు ప్రోత్సాహం అందించడంపైనా లేఖలో ప్రస్తావించారు. సంగీతం, లలిత కళల్లో యువతరాన్ని ప్రోత్సహించడం ద్వారా బాలు కలనెరవేర్చాలన్నారు. ప్రాచీన తెలుగు కళా సారస్వతాన్ని గౌరవించడం ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను సమున్నత స్థాయిలో నిలబెట్టడమే బాలసుబ్రహ్మణ్యంకు మనం అందించే నిజమైన నివాళి అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
