close

తాజా వార్తలు

కాలినడకన అసెంబ్లీకి బయల్దేరిన చంద్రబాబు

అమరావతి: రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాలినడకన అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అన్నారు. భావితరాల కోసo పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకోమన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని పిరికిపంద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.