‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌’ పేరుతో తెదేపా వీడియో
close

తాజా వార్తలు

Updated : 01/06/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌’ పేరుతో తెదేపా వీడియో

ట్విటర్‌లో విడుదల చేసిన చంద్రబాబు

అమరాతి: కక్ష సాధింపులు, అక్రమార్జనకు రాష్ట్రంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని.. నేర స్వభావం మార్చుకోకుండా రాష్ట్రాన్ని నాశనం చేసే స్థితికి తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌’’ పేరిట ట్విటర్‌లో ఆయన వీడియో విడుదల చేశారు. గత చరిత్ర ప్రభావం పాలనపై పడకుండా చూస్తారని వైకాపా నేతల నుంచి ప్రతిఒక్కరూ ఆశించారని అన్నారు. ఏడాది పాలనలో ఇంత గూండాయిజాన్ని ఇంతవరకూ చూడలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా చేశారని పేర్కొన్నారు. దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థనే కూల్చేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పాలకులు నేరపూరిత స్వభావాన్ని మార్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని