close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 01/01/2020 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంద్రయాన్‌-3కి కేంద్రం ఆమోదం: ఇస్రో చీఫ్‌

బెంగళూరు: ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయని తెలిపిన శివన్‌ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు చంద్రయాన్-2 తరహాలోనే ఉంటుందని తెలిపారు. ‘‘చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉండేవి. చంద్రయాన్‌-3లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన ల్యాండర్‌, రోవర్‌ ఉంటాయి’’ అని శివన్‌ వెల్లడించారు. గగన్‌యాన్‌, చంద్రయాన్‌-3 ప్రాజెక్టులతో కొత్త సంవత్సరం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుందన్నారు. 2019లో ఇస్రో అనేక విజయాలు సాధించిందని గుర్తుచేసుకున్నారు. 2019లో గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఎంతో పురోగతి సాధించామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురిని ఎంపిక చేశామని తెలిపారు. వారికి రష్యాలో ఈ నెల మూడోవారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. అలాగే గడిచిన ఏడాదిలో ప్రధానంగా ఇస్రో విస్తరణపై దృష్టిపెట్టామన్నారు. మరిన్ని మిషన్లు ఇస్రో సామర్థ్యాన్ని పెంచే దిశగా సాగుతున్నామన్నారు. ఈ క్రమంలో రెండో స్పేస్‌ పోర్ట్‌ నిమిత్తం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో భూసేకరణ చేశామని తెలిపారు.

చంద్రయాన్‌-2లో చోటుచేసుకున్న వైఫల్యంపైనా శివన్‌ వివరణ ఇచ్చారు. వేగాన్ని తగ్గించే వ్యవస్థ విఫలమవడం వల్లే ల్యాండర్‌ ఉపరితలాన్ని గట్టిగా ఢీకొట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా ల్యాండర్‌ జాడను కనుగొనడంలో సహాయపడిన చెన్నైకి చెందిన యువకుడు షణ్ముగ సుబ్రహ్మణియన్‌ను అభినందించారు.

 

చంద్రయాన్‌-3 ప్రాజెక్టును 2020లోనే చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ మంగళవారం వెల్లడించిన మరుసటి రోజే శివన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘చంద్రయాన్‌-2’ను విఫల ప్రాజెక్టుగా పరిగణించడం తగదని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమూ తొలి ప్రయత్నంలోనే జాబిల్లిపై ల్యాండర్‌ను దించలేకపోయిందని గుర్తుచేశారు. చంద్రయాన్‌-2తో సముపార్జించుకున్న అనుభవం, ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు మౌలిక వసతులు నూతన ప్రాజెక్టులో కీలకంగా మారుతాయని.. చంద్రయాన్‌-2తో పోలిస్తే కొత్త ప్రాజెక్టు వ్యయం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.