ఛార్మి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌
close

తాజా వార్తలు

Updated : 26/10/2020 11:43 IST

ఛార్మి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: తన తల్లిదండ్రులు ఇటీవల కరోనా బారిన పడ్డారని నటి ఛార్మి తాజాగా వెల్లడించారు. అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట్లో ఆమె ఈ పోస్ట్‌ పెట్టారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు కొవిడ్‌-19 బారినపడ్డారని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు.

‘అక్టోబర్‌ 22న నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మార్చినెల నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు‌ కచ్చితంగా పాటిస్తూ వారు హైదరాబాద్‌లోని మా నివాసంలో ఉంటున్నారు. అయితే ఎన్నో జాగ్రత్తలు పాటించినప్పటికీ.. ఇటీవల వచ్చిన హైదరాబాద్‌ వరదలు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో వాళ్లు కరోనా బారిన పడ్డారు. ఎప్పటినుంచో మా నాన్న ఆరోగ్య పరిస్థితి తెలిసిన నాకు ఈ వార్త వినగానే భయంగా అనిపించింది. వెంటనే చికిత్స నిమిత్తం వాళ్లిద్దరూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఒకవేళ మీలో ఎవరికైనా కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి. ఆరంభ దశలోనే గుర్తించి నిర్మూలిస్తే ఎలాంటి నష్టం జరగదు. మా అమ్మానాన్నలు తిరిగి ఆరోగ్యవంతులుగా చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. దుర్గాదేవి మన చుట్టూ ఉన్న చెడుని తొలగించాలని, మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. నా తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రార్థనలు చేయాల్సిందిగా కోరుతున్నాను’ అని ఛార్మి పోస్ట్‌ పెట్టారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని