₹10 లక్షల కోసం కిడ్నాప్‌ డ్రామా!
close

తాజా వార్తలు

Published : 10/10/2020 23:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

₹10 లక్షల కోసం కిడ్నాప్‌ డ్రామా!

చెన్నై: సామాజిక మాధ్యమాల ప్రభావమో, సినిమాల ఎఫెక్టో.. పిల్లలు పెడదారి పడుతున్నారు. సినిమా కథను తలపించేలా ఓ 14 ఏళ్ల బాలుడు కిడ్నాప్‌ డ్రామా ఆడాడు. తనను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ తండ్రి వద్దే భారీ మొత్తంలో వసూలు చేయాలని చూశాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.

9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ట్యూషన్‌కి వెళుతున్నట్లు చెప్పి ఇంటినుంచి బయటకు వచ్చాడు. కాసేపటికి తండ్రికి ఫోన్‌ చేసి తనను ఎవరో అపహరించారని, వారు రూ.10 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పాడు. దీంతో భయాందోళనకు బాలుడి తండ్రి హుటాహుటిన దగ్గర్లోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాలుడి సెల్‌ఫోన్‌ను ట్రేస్‌ చేశారు. అతడు చెపాక్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కిడ్నాప్‌ విషయమై ఆరా తీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో డ్రామా ఆడుతున్నట్లు అనుమానించారు. అనంతరం సీసీ పుటేజీని పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాలుడు తన ప్లాన్‌ను అంగీకరించడంతో సదరు విద్యార్థిని పోలీసులు మందలించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ మధ్యే ఘజియాబాద్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు సైతం ఇదే తరహాలో కిడ్నాప్‌ డ్రామా ఆడి పోలీసులకు దొరికిపోయాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని