close

తాజా వార్తలు

Published : 14/10/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నై విజయం.. ప్లేఆఫ్‌ ఆశలు సజీవం

20 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలుపు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో చెన్నై అదరగొట్టింది. హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. దుబాయ్‌ వేదికగా వార్నర్‌ సేనతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్ (42; 38 బంతుల్లో, 1×4, 3×6), అంబటి రాయుడు (41*, 34 బంతుల్లో, 3×4, 2×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. విలియమ్సన్‌ (57; 39 బంతుల్లో, 7×4) పోరాడాడు.    

ఛేదన ఆరంభించిన హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. వార్నర్‌ (9; 13 బంతుల్లో)ను సామ్‌ కరన్‌ ఔట్‌ చేయగా, మనీష్‌ పాండే (4; 3 బంతుల్లో, 1×4) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్‌.. బెయిర్‌స్టో (23; 24 బంతుల్లో, 2×4)తో కలిసి మరోవికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే బెయిర్‌స్టోను జడేజా బౌల్ట్‌చేసి ఆ జట్టును దెబ్బతీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ప్రియమ్‌ గార్గ్‌ (16; 18 బంతుల్లో, 1×4), విజయ్‌ శంకర్‌ (12; 7 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. మరోవైపు విలియమ్సన్‌ తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో అర్ధశతకం బాదాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే విలియమ్సన్‌ ఔటవ్వడంతో హైదరాబాద్‌ ఓటమి ఖరారైంది. రషీద్‌ ఖాన్‌ (14; 7 బంతుల్లో, 1×4, 1×6) సాధించిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించాయి. చెన్నై బౌలర్లలో బ్రావో, కర్ణ్‌ శర్మ రెండు వికెట్లు, జడేజా, సామ్‌కరన్, శార్దూల్ తలో వికెట్ తీశారు.

రాణించిన రాయుడు, వాట్సన్‌

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. డుప్లెసిస్ ఖాతా తెరవకముందే ఔటైనా.. ఓపెనర్‌గా అవతారమెత్తిన సామ్‌ కరన్‌ (31; 21 బంతుల్లో, 3×3, 2×6) మెరిశాడు. అయితే ఓపెనర్లను సందీప్‌ శర్మ పవర్‌ప్లేలోనే పెవిలియన్‌కు చేర్చి చెన్నైను దెబ్బతీశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడుతో కలిసి వాట్సన్‌ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత గేర్‌ మార్చి బౌండరీల మోత మోగిస్తూ మూడో వికెట్‌కు 81 పరుగులు సాధించారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో వరుస ఓవర్లలో వీరిద్దరు పెవిలియన్‌కు చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ (21; 13 బంతుల్లో, 2×4, 1×6), జడేజా (25*, 10 బంతుల్లో, 3×4, 1×6) మెరుపులు మెరిపించారు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ (2/19), ఖలీల్ అహ్మద్‌ (2/45), నటరాజన్‌ (2/41) సత్తాచాటారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.