
తాజా వార్తలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 మెగా క్రికెట్ లీగ్ ఆఖరి అంకానికి చేరింది. అన్ని జట్లూ లీగ్ స్టేజ్‌లో 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే అబుదాబి వేదికగా చెన్నై, పంజాబ్ జట్లు మరికాసేపట్లో తమ చివరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ధోనీసేన గెలవకపోయినా పోయేదేం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 13వ సీజన్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. మరోవైపు ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే పంజాబ్ టీమ్‌కు ఇది తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాహుల్ టీమ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్), జగదీశన్, రవీంద్ర జడేజా, సామ్‌కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్
పంజాబ్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, జేమ్స్ నీషన్, దీపక్ హూడా, క్రిస్‌జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవిబిష్ణోయ్, మహ్మద్ షమి