close

తాజా వార్తలు

Published : 01/04/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇది ‘లాక్‌డౌన్‌’ హారతి..!

రాయ్‌పూర్‌: కరోనావైరస్‌ను నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరూ రాకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పలువురు పోలీసులు లాఠీలకు పని చెబుతుంటే, ఇంకొందరు దణ్ణం పెట్టి మరీ వేడుకుంటున్నారు. మీ ప్రాణాల కోసమే ఈ లాక్‌డౌన్‌ అంటూ వివరిస్తున్నారు. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. 

బయటకు వచ్చిన వారికి హారతి ఇచ్చి, తిలకం దిద్ది, చెవిలో పూలు పెడుతున్నారు. దయచేసి ఇళ్లలోనే ఉండండంటూ సూచిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అవగాహనతో పాటు నవ్వును తెప్పిస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలన్నింటిలో కలిపి ఈ వీడియో 3.7 మిలియన్స్‌ను సొంతం చేసుకుంది. నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు, లైక్స్‌ వస్తున్న ఆ వీడియోను మీరు చూసేయండి.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని