డెమోక్రసీ కాదు..బ్యూరోక్రసీ ఎక్కువైంది
close

తాజా వార్తలు

Updated : 11/12/2020 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డెమోక్రసీ కాదు..బ్యూరోక్రసీ ఎక్కువైంది

దిల్లీ:  దేశంలో ప్రజాస్వామ్య(డెమోక్రసీ) ప్రభావం అతిగా ఉందంటూ నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తప్పుబట్టారు. డెమోక్రసీ కాదని, బ్యూరోక్రసీనే ఎక్కువైందని మండిపడుతూ..వరుస ట్వీట్లలో కేంద్రం, యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘దేశంలో ప్రజాస్వామ్య ప్రభావం అధికంగా ఉందని ఒక బ్యూరోక్రాట్ ఆవేదన చెందుతున్నారు. కానీ, తీవ్రమైన బ్యూరోక్రసీ ఉందని ప్రజాస్వామ్యవాది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదార ప్రజాస్వామ్య శిథిలాలపై నూతన పార్లమెంట్ భవనానికి పునాది వేశారు. మరోవైపు, సృజనాత్మకంగా ముందుకెళ్లే యూపీ ప్రభుత్వానికి రెండు నోబెల్‌ బహుమతులను అందుకునే అర్హత ఉంది. ఒకటి సాహిత్యం(కల్పన)లో, రెండోది శాంతికి. అలాగే చట్టాల రూపకల్పనలో కూడా ఆ ప్రభుత్వానిది అందెవేసిన చేయి’ అని చిదంబరం వరుస ట్వీట్లలో ఎద్దేవా చేశారు. యోగి ప్రభుత్వం చట్టాలను దుర్వినియోగం చేస్తోందని విరుచుకుపడ్డారు. కాగా, గురువారం ప్రధాని నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా..నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌ కాంత్ మాట్లాడుతూ..భారత్‌లో ప్రజాస్వామ్య ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కఠినమైన సంస్కరణలు తీసుకురావడం క్లిష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇవీ చదవండి:

వారు నియంతల్లా వ్యవహరిస్తున్నారు:మమత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని