close
Array ( ) 1

తాజా వార్తలు

చాక్లెట్‌ వేడుక చేసుకుందామా!

చాక్లెట్‌ వేడుక చేసుకుందామా!

చాక్లెట్‌ దగ్గర చిన్నాపెద్దా ఏంటి? ఎవ్వరికైనా నోరూరిపోతుంది! పెద్దరికం పక్కనపెట్టి బాల్యం అరువు తెచ్చుకుని మరీ చాక్లెట్‌ని చప్పరించాలనిపిస్తుంది. కొత్త సంవత్సరం వేళ మనసూరించే చాక్లెట్‌తో తీయని వేడుకలు చేసుకుందాం. కొత్త రుచులు చవిచూసేద్దాం...

ఇంట్లోనే చేద్దాం!చాక్లెట్‌ వేడుక చేసుకుందామా!

కావాల్సినవి: కొకొవా పొడి- ఐదు చెంచాలు, పాల పొడి- ఒకటింపావు కప్పు, బటర్‌- పావుకప్పు, పంచదార- 2/3 కప్పు, నీళ్లు- అరకప్పు

తయారీ: పాలపొడిని, కొకొవా పొడిని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు పోసి వేడెక్కాక అందులో పంచదార వేసి తీగపాకం వచ్చేంతవరకూ మరిగించుకోవాలి. ఇప్పుడు బటర్‌ వేసి కరిగించుకుని దించేసుకోవాలి. ఇందులో ఇందాక మనం జల్లించి పెట్టుకున్న కొకొవా, పాలపొడి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ వెళ్లాలి. ఇప్పుడు ఒక పాత్రకి బటర్‌రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి పైన సమానంగా ఉండేటట్టు ఏదైనా వెడల్పాటి గరిటెతో సరిచేయాలి. పావుగంటపాటు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి కుకీ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసుకోవాలి. రంగుల కాగితాల్లో చుట్టుకుని పిల్లలకు సర్‌ప్రైజింగ్‌గా ఇచ్చి చూడండి.

టిప్స్‌

ఈ చాక్లెట్‌నే కాస్త భిన్నమైన రుచిలో కావాలనుకుంటే బటర్‌ కలిపేటప్పుడు అరచెంచా వెనిల్లా ఎసెన్స్‌ కానీ, చెంచా కాఫీపొడి కానీ కలుపుకోవచ్చు. పైన బాదం, పిస్తాలతో అలంకరించుకోవచ్చు. తీగపాకాన్ని ఎలా చూడాలో చాలామందికి తెలియదు. పాకాన్ని వేళ్ల మధ్యకి తీసుకున్నప్పుడు ఒకటే తీగ రావాలి. అది కూడా మధ్యలో తెగిపోకూడదు. ఒక వేళ అలా జరిగితే ఇంకొంచెం సేపు పాకాన్ని వేడిచేసుకోవాలి.

స్ట్రాబెర్రీ డిప్స్‌చాక్లెట్‌ వేడుక చేసుకుందామా!

కావాల్సినవి: తాజా స్ట్రాబెర్రీలు - అరకిలో, డార్క్‌ చాక్లెట్‌- రెండు కప్పులు, వైట్‌ చాక్లెట్‌- అరకప్పు, వ్యాక్స్‌ పేపర్‌, జిప్‌లాక్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌

తయారీ: స్ట్రాబెర్రీలను శుభ్రం చేసి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో వేడివేడి నీళ్లు పోసుకుని అందులో మరొక పాత్రను ఉంచి డార్క్‌చాక్లెట్‌ని కరిగించుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు పొడి స్ట్రాబెర్రీలను తీసుకుని ఆకులు ఉన్న వైపు కాకుండా మరొకవైపు చాక్లెట్‌లో ముంచాలి. సగానికంటే ఎక్కువగా ముంచిన వీటిని బేకింగ్‌ షీట్‌పై పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు వైట్‌చాక్లెట్‌ని ఇందాక మనం చేసిన డబుల్‌ బాయిలింగ్‌ విధానంలోనే మరిగించుకుని జిప్‌లాక్‌ బ్యాగులో పోసుకోవాలి. చాక్లెట్‌ మొత్తాన్ని ఒక మూలకు రానిచ్చి మెహందీ మాదిరిగా స్ట్రాబెర్రీపై సింపుల్‌ డిజైన్‌ వేసుకుంటే సరి. వీటిని ఫ్రిజ్‌లో పెట్టి పిల్లలకు వడ్డిస్తే అంతకంటే పండగ ఉంటుందా!

చాక్లెట్‌ బ్రౌనీచాక్లెట్‌ వేడుక చేసుకుందామా!

కావాల్సినవి: బటర్‌- అరకప్పు, బ్రౌన్‌షుగర్‌- కప్పు, గుడ్లు- రెండు, వెనిల్లా- చెంచా, కొకొవా పౌడర్‌- కప్పులో మూడోవంతు, మైదా- అరకప్పు, ఉప్పు- చిటికెడు, బేకింగ్‌ పౌడర్‌- పావుకప్పు

తయారీ: అవెన్‌ని 175 డిగ్రీల దగ్గర వేడిచేసి ఉంచాలి. వెడల్పాటి పాత్రలో బటర్‌ పేపర్‌ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు వేడిచేసుకుని అందులో మరొక పాత్రని ఉంచి బటర్‌ని కరిగించుకోవాలి. అందులో పంచదార వేసి కరిగించుకోవాలి. నిజానికి అది పూర్తిగా కరగదు. గుడ్లని చితక్కొట్టి అందులో ముందుగా వెనిల్లా వెసెన్స్‌ వేసి కలుపుకొని... ఈ మిశ్రమాన్ని మైదా, కొకొవా, ఉప్పు, బేకింగ్‌సోడా మిశ్రమంతో కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని వెడల్పాటి పాన్‌లో సమానంగా పరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవెన్‌లో అరగంటపాటు ఉడికించుకోవాలి. అంచులు కాలి పైన లేయర్‌ ముక్కలుగా పగులుతున్నప్పుడు అది పూర్తిగా తయారయ్యిందని అర్థం. అప్పుడు బయటపెట్టుకోవాలి.

బర్ఫీచాక్లెట్‌ వేడుక చేసుకుందామా!

కావాల్సినవి: కోవా- ఒకటిన్నర కప్పు(చప్పనిది), పాలు- పావుకప్పు, పాలపొడి- రెండు చెంచాలు, పంచదార- ముప్పావు కప్పు, కుంకుమ పువ్వు- నాలుగు రేకులు, నెయ్యి- ఒకటిన్నర చెంచా, యాలకుల పొడి- అరచెంచా, కొకొవాపొడి- చెంచా, పిస్తా పలుకులు- చెంచాన్నర

తయారీ: ఒక చెంచా పాలకి కుంకుమ పువ్వు రేకలని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో నెయ్యిని కరిగించుకోవాలి. అందులో చిదిమిన కోవాని వేసి గరిటెతో కలుపుకోవాలి. దీనికి పాలు, పంచదార వేసి, కుంకుమపువ్వు కలిపిన పాలు కూడా వేసి కలుపుకోవాలి. పాన్‌ నుంచి మిశ్రమం విడిపోతున్నప్పుడు మూడొంతులు తీసేసి వెడల్పాటి పాత్రకు నెయ్యిరాసి అందులో సమానంగా పరుచుకోవాలి. అది చల్లారుతున్న సమయానికి ఇక తక్కిన మిశ్రమంలో కొకొవా పొడి వేసుకుని బాగా కలిపి పూర్తిగా చల్లారిపోకుండా చూసుకుని మరో లేయర్‌గా వేసుకోవాలి. గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత కత్తితో సమానంగా ముక్కలుగా కత్తిరించుకోవాలి.

కొకొవా పొడి లేకపోతే బదులుగా చాక్లెట్‌ సిరప్‌ని కూడా వాడుకోవచ్చు. 
బాదం లేదా పిస్తా పలుకులు బర్ఫీపైన చల్లుకుంటే రుచిగా ఉంటాయి.

చాక్లెట్‌ వేడుక చేసుకుందామా!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.