close

తాజా వార్తలు

Updated : 24/11/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రుణ మాఫీ..పన్ను తగ్గింపు..ఇప్పుడు ఇది

ఆర్బీఐ సిఫారసుపై రాహుల్‌ ధ్వజం

దిల్లీ: ప్రైవేటు బ్యాంకుల్లోకి కార్పొరేట్లను అనుమతించాలంటూ రిజర్వు బ్యాంకు కార్యాచరణ బృందం చేసిన సిఫారసులను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ‘కాలక్రమాన్ని అర్థం చేసుకోండి’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘కాలక్రమాన్ని అర్థం చేసుకోండి: తొలుత కొన్ని బడా కంపెనీలకు రుణమాఫీ; తర్వాత కంపెనీలకు పన్ను తగ్గింపు; ఇప్పుడు, వీరు నెలకొల్పబోయే బ్యాంకులకు నేరుగా ప్రజలు ఆదా చేసుకున్న సొమ్మును అప్పగించడం’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు. అలాగే ఈ విషయంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చేసిన విమర్శల్ని ట్వీట్‌కు జతచేశారు.  

కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకులు పెట్టడానికి అనుమతివ్వాలంటూ రిజర్వు బ్యాంక్‌ కార్యాచరణ బృందం (ఐడబ్ల్యూజీ) చేసిన ప్రతిపాదన  ‘పిడుగుపాటు’లా అనిపించిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య సంయుక్తంగా రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో వ్యాపార సంస్థల జోక్యం పరిమితంగా ఉండడం చాలా ముఖ్యమని అన్నారు.

ఇవీ చదవండి..

కార్పొరేట్లు బ్యాంకులు పెడితే ఎలా?

ప్రైవేటు బ్యాంకుల్లోకి కార్పొరేట్‌ దిగ్గజాలు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన