close

తాజా వార్తలు

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సుదీర్ఘంగా సాగిన చర్చ

అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు

దిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చసాగింది. దాదాపు 6 గంటలపాటు ఈ చర్చ నడిచింది. చర్చల అనంతరం సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 391 మంది పాల్గొన్న సభలో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి.

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ప్రధాని మోదీ స్పందించారు. ‘‘ సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలు, పార్టీలకు కృతజ్ఞతలు. పౌరసత్వ సవరణ బిల్లు దేశపు మానవతా విలువలకు అనుగుణంగా ఉంది. అమిత్‌ షాను ప్రత్యేకంగా ప్రశంసించాలనుకుంటున్నా. పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన అన్ని అంశాలు చక్కగా వివరించారు. ఎంపీలు అడిగిన అన్ని ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం చెప్పారు’’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.     
 

 

ప్రతిపక్షాల నిరసనల నడుమ ఈ బిల్లును సోమవారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ బిల్లు చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. ఈ బిల్లును తీసుకురావడం వెనుక ఎలాంటి రాజకీయ అజెండా లేదని పేర్కొన్నారు. శరణార్థులకు పౌరసత్వం కల్పించే లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. శరణార్థుల హక్కులను పౌరసత్వ సవరణ బిల్లు కాపాడుతుందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు చట్ట వ్యతిరేకం కాదన్నారు. శరణార్థులకు సరైన గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టానికి, ఆర్టికల్‌ 14కు వ్యతిరేకం కాదన్నారు. శ్రీలంక తమిళీయులకు పౌరసత్వం ఉందని, రోహింగ్యాలకు దేశంలో అనుమతి లేదని అమిత్‌ షా స్పష్టం చేశారు. ఈ బిల్లు వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. విభజనను కాంగ్రెస్‌ ఎందుకు అడ్డుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. బెంగాలీ హిందువులు దేశానికి రావడం మీకు ఇష్టం లేదా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మహత్మాగాంధీ విభజనకు ఎప్పుడూ అనుకూలంగా లేరని అమిత్‌ షా అన్నారు. శరణార్థులకు, చొరబాటుదారులకు మధ్య తేడాను విపక్షాలు తెలుసుకోవాలి అని అమిత్ షా అన్నారు.   

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.