‘కాఫీడే’ సీఈవోగా సిద్ధార్థ సతీమణి
close

తాజా వార్తలు

Published : 08/12/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కాఫీడే’ సీఈవోగా సిద్ధార్థ సతీమణి

బెంగళూరు: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థకు నూతన సీఈవోగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కుమార్తె అయిన మాళవిక.. అప్పుల్లో ఉన్న కాఫీడే సంస్థను తిరిగి నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు గతంలో చెప్పారు. సీఈవోతో పాటు అదనపు డైరెక్టర్లుగా సీహెచ్‌ వసుంధరా దేవీ, గిరి దేవనూర్‌, మోహన్‌ రాఘవేంద్రను సంస్థ బోర్డు నియమించింది. వీరు 2025 వరకు ఆయా పదవుల్లో కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. 

కాఫీడే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ గతేడాది నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణించిన తర్వాత కాఫీ డే సంస్థకు ఇండిపెండెంట్‌ బోర్డు సభ్యుడైన ఎస్వీ రంగనాథ్‌ మధ్యంతర ఛైర్మన్‌గా వ్యవహరించారు. బెంగళూరుకు చెందిన కేఫ్‌ కాఫీ డే దేశవ్యాప్తంగా వందలాది కాఫీ షాప్‌లను నిర్వహిస్తోంది. 

ఇదీ చదవండి..

ఐసీఐసీఐ మొబైల్‌ యాప్‌లో కీలక మార్పులు

లాక్‌డౌన్‌లో టికెట్‌ రద్దు సొమ్ము వాపస్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని