100ఏళ్ల యోధుడు.. త్రివిధ దళాల్లో పనిచేశాడు
close

తాజా వార్తలు

Published : 11/12/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

100ఏళ్ల యోధుడు.. త్రివిధ దళాల్లో పనిచేశాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: కల్నల్‌ ప్రీతిపాల్‌ సింగ్‌ గిల్‌(రిటైర్డ్‌).. ఓ ‘గగన’ వీరుడు, శత్రవులను భయపెట్టే ‘సైనికుడు’.. అలలపై పోరాడే ‘నావికుడు’.. అవును ఈ 100ఏళ్ల యువకుడు త్రివిధ దళాల్లో పనిచేసిన ఏకైక యోధుడు. దేశానికి సేవ చేసే అదృష్టం కొందరికే వస్తుంది. కానీ ప్రీతిపాల్‌సింగ్‌ను మూడింతలు ఎక్కువ వరించింది. వాయుసేన, నౌకదళం, భారత సైన్యం.. ఇలా మూడు దళాల్లో మాతృభూమికి సేవలందించిన కల్నల్‌ ప్రీతిపాల్‌ సింగ్‌ గిల్‌ నేడు 100వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి..

1942లో రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌తో ప్రీతిపాల్‌ సింగ్‌ తన సైనిక జీవితాన్ని ఆరంభించారు. మిలిటరీలో చేరేందుకు ఆయన కుటుంబసభ్యులు అంగీకరించనప్పటికీ.. వాయుసేనలో చేరారు. కరాచీలో పైలట్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. హోవర్డ్‌ యుద్ధవిమానాలను నడిపారు. అయితే విమాన ప్రమాదంలో కొడుకును కోల్పోతానన్న భయంతో ప్రీతిపాల్‌ తండ్రి ఆయనను బలవంతంగా వాయుసేన నుంచి తీసుకొచ్చారు. దాదాపు ఏడాదికి పైగా ప్రీతిపాల్‌ ఎయిర్‌పోర్స్‌లో పనిచేశారు. 

ఆ తర్వాత 23ఏళ్ల వయసులో ప్రీతిపాల్‌ సింగ్‌ భారత నౌకాదళంలో చేరారు. 1943 నుంచి 1948 వరకు నేవీలో పనిచేశారు. నౌకాదళంలో పనిచేస్తున్న సయమంలోనే రెండో ప్రపంచ యుద్ధంలో భారత్‌ తరఫున పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్‌ తీర్‌పై విధులు నిర్వహించారు. నేవీ అధికారిగా పనిచేస్తూనే.. ఆర్టిల్లరీ(ఆయుధాలు) స్కూల్‌లో లాంగ్‌ గన్నరీ స్టాఫ్‌ కోర్స్‌కు అర్హత సాధించారు. అలా కోర్సు పూర్తిచేసుకుని 1951లో గన్నర్‌ అధికారిగా భారత ఆర్మీలో చేరారు. 1965లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధంలో మీడియం రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు. చివరగా మణిపూర్‌లో అసోం రైఫిల్స్‌ సెక్టార్‌ కమాండర్‌గా విధులు నిర్వహిస్తూ 1970లో పదవీ విరమణ చేశారు. 

‘‘పాక్‌తో యుద్ధం సమయంలో మా తుపాకులను దాయాది దేశం దొంగలించింది. అయితే వారిని ఎదిరించి తుపాకులు తెచ్చుకున్నాం. గన్నర్‌కు తుపాకీ చాలా పవిత్రమైనది.. దానిని ఎప్పటికీ విడిచిపెట్టం’’ అని ఓ ఇంటర్వ్యూలో కల్నల్‌ ప్రీతిపాల్‌ చెప్పారు. సైన్యాన్ని వీడినా ఆ ధీరత్వం ఇంకా ఆయనలో తొణికిసలాడుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఎంతోమంది యువతను మిలిటరీలో చేరమని కల్నల్‌ ప్రీతిపాల్‌ ప్రోత్సహిస్తున్నారు. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

పంజాబ్‌ సీఎం శుభాకాంక్షలు..

100వ పుట్టినరోజు జరుపుకొంటున్న కల్నల్‌ ప్రీతిపాల్‌కు పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. త్రివిధ దళాల్లో సేవలందించి ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రీతిపాల్‌ సింగ్‌.. ఇంకా ఎన్నో ఏళ్లు ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని, ఎందరికో స్పూర్తి కలిగించాలని ప్రార్థించారు.

ఇవీ చదవండి.. 

చందమామపైకి భారత సంతతి వ్యక్తి

భారత్‌కు ‘కీ’ దొరికింది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని