close

తాజా వార్తలు

కాంగ్రెస్‌ మానసిక రుగ్మతతో బాధపడుతోంది

ఆగ్రా: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై భాజపా నూతన జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మానసిక రుగ్మతతో బాధపడుతోందని విమర్శించారు. గురువారం ఆగ్రాలో సీఏఏకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. 

‘కాంగ్రెస్‌కున్న అన్ని ఆశలు పోయాయి. ఆ పార్టీ నాయకత్వం మానసిక రుగ్మతతో బాధపడుతోంది’ అని విమర్శించారు. బీఎస్పీ, ఎస్పీ పార్టీలపైనా ఆయన విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి సీఏఏ గురించి ఏమాత్రం తెలియదని అర్థమవుతోంది. వాళ్లు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాత్రమే అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. సీఏఏ పౌరసత్వం ఇచ్చేందుకే కానీ లాక్కునేందుకు కాదన్నారు. ఈ చట్టం గురించి ఏ మాత్రం అవగాహన లేని వాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా ప్రధాని మోదీ భాజపా నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే పలువురు కేంద్రమంత్రులు సీఏఏకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.