ధగధగ మెరిసిన అయోధ్య..గిన్నీస్‌ బుక్‌ ప్రశంస
close

తాజా వార్తలు

Published : 18/11/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధగధగ మెరిసిన అయోధ్య..గిన్నీస్‌ బుక్‌ ప్రశంస

ఐదు నిమిషాలు వెలిగిన 6,06,569 దీపాలు

అయోధ్య: దీపావళి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య నగరంలోని సరయు నది ఒడ్డు లక్షల దీపాలతో వెలిగిపోయిన సంగతి తెలిసిందే. ఒకేసారి 6,06,569 దీపాలు ఐదు నిమిషాల పాటు రామ్‌కీ పైడీ ఘాట్లు వద్ద కాంతులీనాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నేతృత్వంలో తలపెట్టిన ఈ దీపోత్సవం గిన్నీస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. తాజాగా ఆ రాష్ట్ర పర్యాటక రంగానికి, రామ్‌ మనోహర్ లోహియా అవథ్‌ విశ్వవిద్యాలయానికి గిన్నీస్‌ బుక్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. 6,06,569 చమురు దీపాలు ఐదు నిమిషాల పాటు వెలుగొందాయంటూ ట్వీట్ చేయడంతో పాటు ఆ సుందర దృశ్యాలను షేర్ చేశారు.

ఇదిలా ఉండగా..ఈ దీపోత్సవాన్ని విజయవంతం చేయడంలో లోహియా విశ్వవిద్యాలయానికి చెందిన 8,000 మంది విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. వారిని, అయోధ్య యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందించారు. ఆయన 2017లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రతిఏటా ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు దీపాల సంఖ్యను పెంచుతూ రికార్డులు బద్ధలు కొడుతున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని