close

తాజా వార్తలు

Published : 28/11/2020 21:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతులపై దాడి దుర్మార్గపు చర్య: రాహుల్‌గాంధీ

కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

దిల్లీ: నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాలుస్తోంది. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు వివిధ మార్గాల ద్వారా రాజధానిలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాగా పోలీసులు రైతులను ఎక్కడికక్కడే నిలువరించారు. అనేకమంది నగరంలో శాంతియుత నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రైతులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతోపాటు కేంద్రం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రైతుల పట్ల పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఓ వృద్ధ రైతుపై పోలీసు లాఠీ ఎత్తిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ దానిని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. జై జవాన్‌, జై కిసాన్‌ అనేది మన నినాదం. కానీ ప్రధాని మోదీ అహంకార ధోరణితో నేడు యువత (పోలీసులను ఉద్దేశించి) రైతులకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం’ అని ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు. ‘రైతుల కోసం కేంద్రం ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా వారు సమ్మతించాలి. కానీ ప్రభుత్వం మాత్రం వారి బాధలు వినదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ హుడా స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి రైతుల వేదన కంటే అహ్మదాబాద్‌లోని కంపెనీల్లో ఫొటోలు దిగడం, టీవీల్లో కనిపించడమే ముఖ్యంగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ భాజపాపై మండిపడ్డారు. భాజపా రైతులను చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. రైతులను కించపరిచే ఏకైక పార్టీ భాజపా అని విమర్శించారు.
Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన