
తాజా వార్తలు
ఎస్ఈసీ ఉత్తర్వులపై కాంగ్రెస్ అభ్యంతరం
హైదరాబాద్: స్వస్తిక్ గుర్తు కాకుండా పోలింగ్ స్టేషన్ నంబర్లున్న గుర్తుతో ఓటు వేసినట్టు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ ఇతర గుర్తుతో ఓటు వేసి ఉన్నా అక్కడ ఓట్ల లెక్కింపును నిలుపుదల చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని రాజకీయపార్టీల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధికి పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ లేఖ రాశారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందన్నారు. తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ తప్పిదాలు జరిగాయని వివరించారు.
ఎన్నికల సంఘం అర్ధరాత్రి ఉత్తర్వులు
గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి తీసుకురావడంతో.. దానికి పరిష్కారంగా అలాంటి ఓట్లనూ లెక్కించాలంటూ ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
