
తాజా వార్తలు
రైతుల భూములు లాక్కొనేందుకు కుట్ర!
లక్నో: నూతన వ్యవసాయ చట్టాల లొసుగులో కేంద్రం రైతుల భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం అసత్య వాగ్దానాలు గుప్పిస్తోందని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విటర్లో స్పందించారు.
‘‘వ్యవసాయం చేసే మేము తప్పుడు వాగ్దానాలకు లొంగిపోం. ఎప్పటిలాగే కష్టపడతాం. మా మార్కెట్లు, పంటకు కనీస మద్దతు ధర పొందే హక్కును పరిరక్షించుకుంటాం’’అని అఖిలేష్ ట్వీట్ చేశారు. గత ఆరు రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హరియాణాకు చెందిన రైతులు సింఘు, టక్రీ, ఘాజీపూర్ ప్రాంతాల్లో నిరసనలు చేసతున్న సంగతి తెలిసిందే.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు